ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్పీడు పెంచిన సునీల్

Tue, Feb 16, 2016
సునీల్
సునీల్
సునీల్ స్పీడ్ పెంచాడు .. తదుపరి సినిమాలను చకచకా పూర్తిచేసే పనిలో పడ్డాడు. అలా వీరూ పోట్ల సినిమాకి సంబంధించిన ఫస్టు షెడ్యూల్ ను కూడా పూర్తిచేశాడు. కథానాయకుడిగా ఆ మధ్య వరుసగా పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, సునీల్ తన దూకుడు కాస్త తగ్గించాడు. హాస్యానికి దూరంగా వెళ్లకుండా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. అందువలన 'భీమవరం బుల్లోడు' సినిమా తరువాత గ్యాప్ వచ్చింది.

ఆ తరువాత ఆయన చేసిన 'కృష్ణాష్టమి' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపున వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆయన చేస్తోన్న సినిమా షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వీరూ పోట్లతో కలిసి 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాను కమిటయ్యాడు. ఇటీవల హైదరాబాద్ లో ఆరంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్, నిన్నటితో పూర్తయింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించామనీ, చాలా బాగా వచ్చాయని వీరూ పోట్ల చెప్పాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న ఈ సినిమాను, వేసవి సెలవులకు విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)