ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రానా మూవీ తెలుగు రీమేక్ లేనట్టేనా?

Mon, Feb 15, 2016
రానా
రానా
రానా ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన తమిళ మూవీ 'బెంగుళూర్ నాట్కాల్'ను తెలుగులో రీమేక్ చేయకపోవచ్చని అంటున్నారు. అనువాదం చేసే అవకాశమే ఎక్కువగా వుందని చెబుతున్నారు. 2014లో మలయాళంలో ఘన విజయాలను అందుకున్న సినిమాల జాబితాలో 'బెంగుళూర్ డేస్' ఒకటి. అంజలి మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

దాంతో ఈ సినిమాను ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. తెలుగులో ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే, తమిళ రీమేక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రానా .. ఆర్య .. బాబీ సింహా .. సమంతా .. రాయ్ లక్ష్మీ .. శ్రీదివ్య తదితరులు ఈ సినిమాలో ముఖ్య భూమికలు పోషించారు. అయితే తమిళంలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ కి నోచుకునే అవకాశం లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)