ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ చేయాల్సిన కథ అది!

Sun, Feb 14, 2016
సునీల్
సునీల్
సినిమా రంగంలో ఇదో విచిత్రం. అప్పుడప్పుడు ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లిపోతుంటాయి. అలాగే అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు హాస్య కథానాయకుడు సునీల్ కి వెళ్లిపోయింది. 'కృష్ణాష్టమి' సినిమా విషయంలో ఈ ముచ్చట చోటు చేసుకుంది. ఈ కథను అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వాసువర్మ రూపొందించాడట. ఈ విషయాన్ని సునీల్ స్వయంగా తెలిపాడు.
"ఓ రోజు దిల్ రాజు గారు ఫోన్ చేసి, పెద్ద హీరో కోసం ఓ కథ తయారుచేశాం. అయితే ఆయనతో కుదరలేదు. కొన్ని మార్పులు చేస్తే నీకు బాగుంటుంది, వింటావా? అన్నారు. వెళ్లి కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. దాంతో చేయడానికి వెంటనే ఓకే చెప్పేశాను" అని చెప్పాడు సునీల్. ఆ విధంగా బన్నీ కథ సునీల్ కి వెళ్లిపోయిందన్న మాట!
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)