ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హన్సిక అభిమానులు రెడీ అవ్వచ్చు!

Fri, Feb 12, 2016
హన్సిక
హన్సిక
చబ్బీ బ్యూటీ హన్సిక ఎంత అందంగా వుంటుందో, అంత అందంగా బొమ్మలు కూడా గీస్తుంది. చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనం ఆమెకు పెద్ద హాబీ. ఇప్పుడు సినిమా హీరోయిన్ అయినప్పటికీ ఆమె ఆ హాబీని వదలలేదు. తనకు ఖాళీ దొరికినప్పుడు .. మంచి మూడ్ వున్నప్పుడు కుంచె తీసుకుని పెయింటింగ్స్ వేస్తుంటుంది. అంతేకాదు, వాటిని అమ్మకానికి పెట్టి అలా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది. అలా ఆమె వేసిన పెయింటింగ్స్ లో పది లక్షలకు అమ్ముడుపోయినవి కూడా వున్నాయట.
ఇక విషయానికి వస్తే, ఈమధ్య కాలంలో వేసిన పలు పెయింటింగ్స్ ను అమ్మడానికి అమ్మడు త్వరలో చెన్నయ్ లో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది. కాబట్టి తమ అభిమాన నటి గీసిన బొమ్మల్ని సొంతం చేసుకోవాలనుకునే అభిమానులు డబ్బులు సిద్ధం చేసుకోవచ్చు. అన్నట్టు, కృష్ణుడిని వివిధ రూపాలలో పెయింట్ చేయడమంటే హన్సికకు భలే సరదా. అందుకే, ఆమె పెయింటింగ్స్ లో ఎక్కువగా శ్రీకృష్ణుడి బొమ్మలే వుంటాయి!
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)