ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇలియానా

Wed, Feb 10, 2016
ఇలియానా
ఇలియానా
నాజూకు సుందరి ఇలియానా బాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా చేసే 'రుస్తుం' సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ తగిలింది. అంతకన్నా కావలసినదేం ఉందంటూ ఆమె ఆనందంగా అంగీకరించిందని అంటున్నారు. తెలుగులో అవలీలగా అగ్రస్థానానికి చేరుకున్న కథానాయికల జాబితాలో ఇలియానా పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. కుర్రకారు కలల రాణిగా, యూత్ లో ఆమెకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

అలాంటి పరిస్థితుల్లోనే ఆమె హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆరంభంలో కాస్త ఆశాజనకంగా అనిపించినా, ఆ తరువాత ఆమె అవకాశాల కోసం ఎదురుచూడవలసి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఆమెకి అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' సినిమాలో ఛాన్స్ లభించింది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి టినూ దేశాయ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇలియానాకి ఈ సినిమా అక్కడ మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)