ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కార్తీకి జోడీ దొరికేసింది!

Tue, Feb 09, 2016
కార్తీ
కార్తీ
కార్తీకి కథానాయికగా సాయిపల్లవి దొరికేసింది .. మణిరత్నం రూపొందించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. 'ఓకే బంగారం' సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, మణిరత్నం నెక్స్ట్ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకున్నారు. ఆయన కూడా అలాగే కథలను రెడీ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన అనుకున్న కాంబినేషన్లు కుదరలేదు. దాంతో మరో కథను రెడీ చేసుకుని కార్తీకి వినిపించారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అల్లిన ఈ కథ బాగా నచ్చడంతో కార్తీ వెంటనే ఒప్పేసుకున్నాడట. అయితే ఆయన జోడీగా నిత్యామీనన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ మణిరత్నం ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'ప్రేమమ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయికి, మణిరత్నం సినిమాలో ఇంత త్వరగా అవకాశం దక్కడం విశేషంగా చెప్పుకుంటున్నారు. జూన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)