ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుకుమార్ తో గీతా ఆర్ట్స్ మూవీ!

Tue, Feb 09, 2016
సుకుమార్
సుకుమార్
సుకుమార్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ వారు ఒక సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ విషయంపై అల్లు అరవింద్ .. సుకుమార్ మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంది.

దాంతో సుకుమార్ తదుపరి సినిమా ఎవరితో వుండనుందోననే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే మొన్నీమధ్య సుకుమార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, తన తదుపరి సినిమా చరణ్ తో గానీ .. అల్లు అర్జున్ తో గాని వుండవచ్చని చెప్పాడు. ఇక రీసెంట్ గా సుకుమార్ ను అల్లు అరవింద్ పిలిపించి మాట్లాడారనీ, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయమని చెప్పారని అనుకుంటున్నారు. అయితే ఆ సినిమా చరణ్ తో ఉంటుందా? .. అల్లు అర్జున్ తో ఉంటుందా? అనేది తెలియాల్సి వుంది.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)