ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ తో 'క్షణం' ట్రైలర్ లాంచ్

Mon, Feb 08, 2016
మహేశ్ బాబు చేతుల మీదుగా 'క్షణం' సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పీవీపీ బ్యానర్ వారు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, మంచి కథాబలమున్న చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 'క్షణం' చిత్రాన్ని తెరకెక్కించారు.

రవికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అడవి శేష్ .. ఆదా శర్మ .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇటీవల విడుదల చేయబడిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ నెల 10న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. పీవీపీ వారు నిర్మిస్తోన్న 'బ్రహ్మోత్సవం' చిత్రంలో మహేశ్ బాబు .. సమంతా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరితో ఒక స్పెషల్ ఈవెంట్ లో 'క్షణం' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. మార్చి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)