ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆదాశర్మపై 'బొంబాయి' ప్రభావం

Mon, Feb 08, 2016
ఆదాశర్మ
ఆదాశర్మ
సమీర అందరికీ నచ్చుతుందని, అంతగా ఆ పాత్రని తీర్చిదిద్దడం జరిగిందని, తాను 'గరం' సినిమాలో పోషించిన పాత్రను గురించి ఆదాశర్మ చెప్పింది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానున్న సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఇలా అంది. 'ఆది' జోడీగా తాను నటించిన ఈ సినిమాకి మదన్ దర్శకుడిగా వ్యవహరించాడని చెప్పింది. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని అంది.

ఈ సినిమాలో తాను సమీర అనే ముస్లీమ్ యువతి పాత్రను పోషించానని చెప్పింది. కొన్ని సన్నివేశాల్లో తాను బురఖాలో కనిపిస్తాననీ, అందువలన కొన్ని హావభావాలను కళ్లతోనే పలికించవలసి వచ్చిందని అంది. తాను 'హార్ట్ ఎటాక్' సినిమాలో కళ్లతో పలికించిన హావభావాలు నచ్చి, ఈ పాత్ర కోసం తనని మదన్ ఎంపిక చేశాడని చెప్పింది. 'ముంబాయి' సినిమాలో ఈ తరహా పాత్రను మనీషా కొయిరాలా అద్భుతమైన అభినయాన్ని కనబరిచిందనీ, అందువలన ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్రను పోషించానని అంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం వుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)