ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తమన్నా

Mon, Feb 08, 2016
తమన్నా
తమన్నా
ప్రభుదేవా సరసన కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసిన తమన్నా, ఆయనతో నటించే ఆ క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందట. కొరియోగ్రాఫర్ గా .. నటుడిగా .. దర్శక నిర్మాతగా ప్రభుదేవా తన సత్తా చాటుకున్నాడు. తాను ఎంచుకున్న ప్రతి అంశం పైనా ఆయన తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ తానే కథానాయకుడి పాత్రను పోషించడం కోసం రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకి దర్శకుడిగా ఆయన ఎ.ఎల్.విజయ్ ను ఎంచుకున్నాడు. ఇక కథానాయికగా తమన్నాను తీసుకున్నాడు. ఆయనతో జోడీకట్టే ఛాన్స్ దొరికినందుకు తమన్నా సంతోషంతో పొంగిపోతోంది. ఇటీవల తమపై ఫోటో షూట్ జరిగిందనీ .. చాలా బాగా వచ్చిందని చెప్పింది. ఈ సినిమా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కనుందని అంది. ప్రభుదేవా మంచి నటుడనీ .. అద్భుతమైన డాన్సర్ అని కొనియాడింది. ఆయనతో కలిసి స్టెప్పులేయడం ఒక ఛాలెంజ్ లాంటిదనీ .. ఆ సమయం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని అంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమా, తాను చెప్పుకోదగిన చిత్రాల్లో ఒకటి అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)