ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ నిర్ణయం అతణ్ణి నిరాశపరిచిందా?

Sat, Feb 06, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. వక్కంతం వంశీ ప్రాజెక్టుకు ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వలన ఆయన చాలా నిరాశకి గురయ్యాడనేది ఆ వార్త సారాంశం. ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకి వక్కంతం వంశీ కథను అందించాడు. దాంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ ఒక కథను రెడీ చేసి, తానే దర్శకుడిగా ఆ కథను తెరకెక్కించాలని అనుకున్నాడట. అందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని అప్పట్లో అనుకున్నారు.

ఇక ఇటీవల ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాకి సంబంధించి కొరటాలకి ఓకే చెప్పినప్పుడు కూడా, ఆయన తదుపరి సినిమా వక్కంతం వంశీతో వుండనుందనే టాక్ వినిపించింది. అయితే రీసెంట్ గా పూరి చెప్పిన కథ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇక ఈ ఏడాదిలో కూడా వక్కంతం వంశీతో ఎన్టీఆర్ సినిమా లేనట్టేననేది అర్థమైపోయింది. ఈ విషయం పైనే వక్కంతం వంశీ నిరాశకి లోనయ్యాడని అంటున్నారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో .. ఏమో.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)