ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్రివిక్రమ్ మూవీ అప్పుడే రానుందా?

Fri, Feb 05, 2016
త్రివిక్రమ్
త్రివిక్రమ్
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న 'అ ఆ' సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. నితిన్ .. సమంతా .. అనుపమ పరమేశ్వరన్ నాయకా నాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు.

అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వున్న అనిరుధ్, అందుకు సంబంధించిన పనిని ప్రారంభించకుండానే తప్పుకున్నాడు. దాంతో ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ కారణంగా జరిగిన ఆలస్యం వలన, ఈ సినిమాను మార్చ్ లో రిలీజ్ చేయవచ్చనే టాక్ వినిపించింది. ఇక ఏప్రిల్ నెలకి వాయిదాపడిందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారని చెబుతున్నారు. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)