ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఒకేరోజు ఇద్దరు హీరోలను ఒప్పించిన పూరీ!

Fri, Feb 05, 2016
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకేరోజున ఇద్దరు హీరోలకు కథలు చెప్పి ఇద్దరి చేత ఓకే చేయించుకున్నాడు. ఎన్టీఆర్ .... నందమూరి కల్యాణ్ రామ్ లకు నిన్న చెరో కథను చెప్పి ఇద్దరినీ ఇంప్రెస్ చేసి, వారి నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడు. మామూలుగా స్టార్ హీరోలు ఒక సిటింగు లో కథలను ఓకే చేయరు. అలాంటిది ఈ నందమూరి హీరోలిద్దరూ ఆయా కథలు విన్న వెంటనే ఓకే చెప్పేయడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద విశేషం అయింది. కాగా, కల్యాణ్ రామ్ తో చేసే చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తారు. ఏప్రిల్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ తో చేసే సినిమా ఏ బ్యానర్ లో ఉంటుందన్నది త్వరలో తెలుస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)