ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరుణ్ జోడీ కోసం అన్వేషణ

Thu, Feb 04, 2016
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందనున్న 'రాయబారి' సినిమా కోసం ఒక కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేశారు. మరో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. వరుణ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కంచె' సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో అదే జంటతో క్రిష్ 'రాయబారి' సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.

కథ ప్రకారం ఈ సినిమాలో మరో కథానాయిక అవసరం కావడంతో, ఆ కథానాయికను ఎంపిక చేసే పనిలో వున్నారు. ఇద్దరు కథానాయికలతో వరుణ్ రొమాన్స్ చేయనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఎక్కువగా విదేశాల్లోనే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. అక్కడ ఏకధాటిగా 50 రోజుల పాటు షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)