ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా స్పెషల్ సాంగ్ కి భారీ ఖర్చు

Wed, Feb 03, 2016
తమన్నా
తమన్నా
'స్పీడున్నోడు' సినిమా కోసం తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ కి 2 కోట్లకి పైగా ఖర్చు చేసినట్టు, ఈ చిత్ర దర్శక నిర్మాత భీమనేని శ్రీనివాసరావు చెప్పాడు. ఈ స్థాయిలో ఎందుకు ఖర్చు చేశామనేది ఈ సినిమా చూసినవారికి తెలుస్తుందని అన్నాడు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'స్పీడున్నోడు' చిత్రం రూపొందింది.

గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన 'అల్లుడు శీను'లో తమన్నా స్పెషల్ సాంగ్ ని పెట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్ తో ఈ సినిమాలోను తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఈ సాంగ్ కి 2 కోట్లకి పైగా ఖర్చుపెట్టినట్టు భీమనేని శ్రీనివాస్ చెప్పాడు. ఇందుకోసం తమన్నాకి కూడా భారీ పారితోషికాన్ని ముట్టజెప్పామని అన్నాడు. అయితే కేవలం పారితోషికం కోసం కాకుండా, శ్రీనివాస్ తో ఆమెకి గల ఫ్రెండ్షిప్ వలన .. ఈ సాంగ్ కాన్సెప్ట్ నచ్చడం వలన చేయడం జరిగిందని చెప్పాడు. తప్పకుండా ఈ స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అన్నాడు. ఎల్లుండి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)