ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో కథను లైన్లో పెడుతోన్న నిఖిల్

Tue, Feb 02, 2016
నిఖిల్
నిఖిల్
మొదటి నుంచి కూడా నిఖిల్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. అందుకనే అతని సక్సెస్ రేటు .. యూత్ లో క్రేజ్ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అతని సినిమా ఒకటి షూటింగ్ దశలో ఉండగానే, మరో సినిమా కోసం అతను కథను లైన్లో పెడుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించే ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతోంది.

ఇటీవల నిఖిల్ చేసిన 'శంకరాభరణం' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తరువాత ఆయన 'టైగర్' దర్శకుడు ఆనంద్ తో ఒక సినిమా చేస్తున్నాడు. చకచకా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ముగిసేలోగా, స్క్రిపు వర్క్ పూర్తిచేసి రెడీగా ఉండమని సుధీర్ వర్మకి నిఖిల్ చెప్పాడట. దాంతో ఆయన అదే పనిలో వున్నాడు. ఇద్దరూ కలిసి 'స్వామిరారా' ను మించిన స్థాయిలో హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు, ఆ తరువాత చేయనున్న 'కార్తికేయ' సీక్వెల్ పై కూడా నిఖిల్ పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)