ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ సరసన రమ్యకృష్ణ?

Tue, Feb 02, 2016
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ కథానాయికగా ఒకప్పుడు ఎంత బిజీగా వుందో .. సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి తన వయసుకు తగిన పాత్రలను పోషిస్తూ ఇప్పుడూ అంతే బిజీగా వుంది. ముఖ్యంగా బాహుబలి .. సోగ్గాడే చిన్నినాయన తరువాత ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అలా ఆమెకి కమల్ సరసన నటించే ఛాన్స్ సైతం వచ్చిందని అంటున్నారు.

కమల్ కథానాయకుడిగా టి.కె. రాజీవ్ దర్శకత్వంలో 'అమ్మ నాన్న ఆట' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత అదే దర్శకుడితో ఆయన మరో సినిమాను ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో కమల్ కూతురిగా శ్రుతిహాసన్ ని ఎంపిక చేసినట్టుగా ఈ మధ్య వార్తలు వినిపించాయి. కమల్ భార్య పాత్ర కూడా చాలా ముఖ్యమైనది కావడంతో, ఆ పాత్ర కోసం ఈ సినిమా టీమ్ రమ్యకృష్ణతో సంప్రదింపులు జరిపిందట. కథ .. తన పాత్ర పట్ల రమ్యకృష్ణ సానుకూలంగానే స్పందించిందని అంటున్నారు. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి వుందని చెబుతున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందించే ఈ సినిమా, మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)