ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

40 కోట్ల క్లబ్ లో 'సోగ్గాడు'

Mon, Feb 01, 2016
నాగార్జున
నాగార్జున
'సోగ్గాడే చిన్నినాయన' సినిమా 40 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నాగార్జున కెరియర్లో ఒక తీపిజ్ఞాపకంగా మిగిలిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. గట్టిపోటీ ఉన్నప్పటికీ, కథ మీద గల నమ్మకంతో ఈ సినిమాను విడుదల చేయడానికి నాగార్జున ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన నమ్మకం వృథా పోలేదు. 450 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాను, ఆ తరువాత వచ్చిన టాక్ ను బట్టి థియేటర్స్ సంఖ్యను 600కు పెంచారు.

విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబడుతూ, నిన్నటితో 40 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆమధ్య వచ్చిన 'మనం' సినిమా నలభై కోట్ల క్లబ్బుకి కాస్త దూరంలో ఆగిపోయిందనే నాగార్జునకి గల అసంతృప్తిని, 'సోగ్గాడే చిన్నినాయన' తుడిచేశాడు. ఈ సినిమా 40 కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో అక్కినేని అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)