ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభుదేవా జోడీగా తమన్నా

Mon, Feb 01, 2016
తమన్నా
తమన్నా
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ప్రభుదేవాకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నృత్య దర్శకుడిగా .. నటుడిగా తన సత్తా చూపించిన ప్రభుదేవా, ఆ తరువాత దర్శకత్వం వైపు మొగ్గుచూపాడు. ప్రస్తుతం హిందీ సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా వున్నాడు. దర్శకుడిగా అక్కడ సక్సెస్ లను అందుకుంటోన్న ఆయన, ఇటీవల నిర్మాతగాను మారాడు. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, వైవిధ్యభరితమైన కథాంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చెప్పాడు.

సొంత బ్యానర్లో తమిళ్లో ఒక సినిమాను నిర్మించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేశాడు. విజయ్ దర్శకుడిగా వ్యవరించనున్న ఈ సినిమాలో కథానాయకుడిగా ప్రభుదేవానే నటించనున్నాడు. ఆయన సరసన తమన్నాను కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొంత గ్యాప్ తరువాత ప్రభుదేవా హీరోగా నటిస్తుండటం వలన, ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వుంది. ఇక డాన్సుల్లోను తమన్నా శభాశ్ అనిపించుకుంది కాబట్టి, కనువిందుగా ఈ జోడీ వేసే స్టెప్స్ ను చూడాలనే ఆసక్తి అభిమానుల్లో కలగడం సహజం.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)