ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రానా సినిమాలో బాలీవుడ్ హీరో!

Sun, Jan 31, 2016
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్
మిత్రుని కోసం తెలుగు సినిమాలో నటించడానికి బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఒప్పుకున్నాడు. రానా దగ్గుబాటితో అక్షయ్ కు గత కొన్నేళ్లుగా స్నేహం వుంది. గతంలో వీరిద్దరూ కలసి 'బేబీ' హిందీ సినిమాలో నటించారు. అప్పటి నుంచీ వీరి మధ్య ఆ స్నేహం కొనసాగుతోంది. దాంతో తాను నటించే 'పోస్టర్ బాయ్స్' తెలుగు సినిమాలో గెస్ట్ పాత్ర పోషించమని రానా అడగడంతో వెంటనే అక్షయ్ ఓకే చెప్పేశాడట. ఈ చిత్రానికి రానా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న 'రోబో 2' సినిమాలో అక్షయ్ విలన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)