ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నెక్స్ట్ మూవీ గురించి చెప్పిన సుకుమార్

Sun, Jan 31, 2016
సుకుమార్
సుకుమార్
సుకుమార్ తన తదుపరి సినిమా గురించి స్పందించాడు. తన నెక్స్ట్ మూవీ చరణ్ తో గానీ .. బన్నీతోగాని ఉంటుందని చెప్పాడు. తన స్వగ్రామం 'మట్టపర్రు' వచ్చిన ఆయన, అక్కడి విలేకరుల ప్రశ్నకి సమాధానంగా ఈ మాట చెప్పాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమాతో దర్శకుడిగా సుకుమార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేయడానికి అగ్రకథానాయకులంతా ఆసక్తితో వున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ తన స్వగ్రామానికి వెళ్లాడు. తదుపరి సినిమా ఎవరితో చేయనున్నారనే ప్రశ్నకి సమాధానంగా, చరణ్ తో గానీ .. బన్నీతో గాని చేయవచ్చని చెప్పాడు. దాంతో .. మరి దేవిశ్రీప్రసాద్ హీరోగా ఆయన చేస్తానని చెప్పిన సినిమా సంగతేంటి? అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)