ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు తెరపైకి మరో తమిళ హారర్!

Sat, Jan 30, 2016
'మిరుథన్'లో లక్ష్మీ మీనన్, జయం రవి
'మిరుథన్'లో లక్ష్మీ మీనన్, జయం రవి
తెలుగు తెరపైకి మరో తమిళ హారర్ మూవీ రాబోతోంది .. ఆ సినిమా పేరు 'మిరుథన్'. జయం రవి - లక్ష్మీమీనన్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, వచ్చేనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్లో హీరోగా జయం రవికి, హీరోయిన్ గా లక్ష్మీమీనన్ కి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మిరుథన్' అనే హారర్ చిత్రం రూపొందింది. శక్తి సౌందర రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 12న తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
కాగా, తెలుగులో ఈ సినిమా అనువాద హక్కులకి గాను గట్టిపోటీ ఏర్పడిందట. పెద్దమొత్తంలో చెల్లించి, అనువాద హక్కులతో పాటు రీమేక్ రైట్స్ ను కూడా లక్ష్మీ ప్రసన్న సొంతం చేసుకుందట. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన టైటిల్ లోగోను .. ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. తమిళం నుంచి తెలుగు అనువాదాలుగా వచ్చిన కాంచన .. చంద్రకళ సినిమాలకు కాసుల వర్షం కురిసింది. అదే తరహాలో ఈ సినిమా కూడా ఇక్కడ హిట్ కొడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)