ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వినాయక్ దర్శకత్వంలో నితిన్?

Sat, Jan 30, 2016
నితిన్
నితిన్
దర్శకుడు వినాయక్ తో నితిన్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. చిరంజీవి 150వ సినిమాను పూర్తిచేసిన తరువాత, వినాయక్ ఈ సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇటీవల వినాయక్ ను నితిన్ .. అతని తండ్రి మీట్ కావడంతో, ఈ వార్త తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాను నితిన్ తండ్రి నిర్మించాడు. ఆ వ్యవహారాలను నితిన్ దగ్గరుండి చూసుకున్నాడు.

ఈ సినిమా దగ్గర నుంచి నితిన్ ఫ్యామిలీతో వినాయక్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. 'అఖిల్' సినిమా నితిన్ వాళ్లకి లాభాలను తీసుకురాకపోవడంతో, నితిన్ హీరోగా ఒక సినిమా చేస్తానని వినాయక్ అన్నాడట. అందువలన ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం వుందని అంటున్నారు. చిరంజీవితో వినాయక్ చేయవలసిన సినిమా పూర్తయిన తరువాత, నితిన్ కి సంబంధించిన ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుందని అనుకుంటున్నారు. ఈలోగా 'అ ఆ' సినిమాతో పాటు మరో సినిమాను కూడా నితిన్ ఫినీష్ చేయవచ్చని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)