ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కత్రినా హెయిర్ కలర్ ఖర్చు లక్షల్లో!

Fri, Jan 29, 2016
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్
ఇటీవల కాలంలో సినిమాల్లో ప్రతి అంశానికి ప్రత్యేకతనిస్తూ వెళుతున్నారు. ఆ ప్రత్యేకతను గురించి అంతా మాట్లాడుకోవడంతోనే చాలావరకూ పబ్లిసిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు. అలాంటి ప్రత్యేకతలతోనే ప్రేక్షకుల ముందుకు 'ఫితూర్' చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న కత్రినా కైఫ్, ఎరుపురంగుతో కూడిన హెయిర్ తో కనిపిస్తుందట.

ఈ హెయిర్ స్టైల్ కారణంగా ఆమె ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తుందని అంటున్నారు. ఆమె జుట్టుకు ఆ కలర్ ను తెప్పించే ప్రొఫెషనల్స్ ముంబైలో లేకపోవడంతో, లండన్ లోని నిపుణుల చేత ఆ పని చేయించారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా, ఆమె చాలాసార్లు ఈ విషయంపై లండన్ వెళ్లి వచ్చిందట. హెయిర్ కలర్ కోసం ఆమె లండన్ వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్లు .. లండన్ లో ఆమె బసచేసిన స్టార్ హోటల్స్ ఖర్చులు కలుపుకుని 55 లక్షలు లెక్క తేలిందట. ఇప్పుడు ఈ విషయమే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)