ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Jan 27, 2016
హన్సిక
హన్సిక
* దెయ్యం సినిమాలంటే కథానాయిక హన్సికకు చాలా భయమట. "అలాంటి సినిమాల్లో నటించేటప్పుడు భయపడను కానీ, చూసేటప్పుడు అయితే మాత్రం చచ్చేంత భయం. పక్కన మా అమ్మను గట్టిగా పట్టుకుని మరీ చూస్తాను" అంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తాను నటించిన 'కళావతి' హారర్ సినిమా గురించి చెబుతూ అలా చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజవుతోంది.
* మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శౌర్య' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 31న హైదరాబాదులో నిర్వహిస్తారు.
* శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న 'మెంటల్ పోలీస్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)