ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఛాలెంజింగ్ రోల్' అంటోన్న లావణ్య

Mon, Jan 25, 2016
లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి
అది నిజంగా చాలా కష్టతరమైన పాత్ర .. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని చేశానంటూ, 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'లో తన పాత్ర గురించి లావణ్య త్రిపాఠి చెప్పింది. నవీన్ చంద్ర - లావణ్య త్రిపాఠి జంటగా, జగదీశ్ తలశిల తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, డబ్బుచుట్టూ తిరిగే క్రైమ్ కామెడీగా ఈ సినిమా రూపొందిందని అంది.

ఈ సినిమాలో తాను దేవి .. ఉమాదేవి .. అంకాలమ్మ అనే మూడు పాత్రల్లో కనిపిస్తానని చెప్పింది. ఈ మూడింటిలో అంకాలమ్మ పాత్ర చేయడం కొంత కష్టంగా అనిపించిందనీ, అయినా ఛాలెంజింగ్ గా తీసుకుని చేశానని అంది. మెడనిండా ఆభరణాలు .. నిమ్మకాయ దండలు ధరించి, చేతిలో త్రిశూలంతో నటించడం తనకి కొత్తగా అనిపించిందని చెప్పింది. ఈ పాత్ర తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంది. తాను నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుందనీ, అదే మాదిరిగా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)