ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలీస్ అధికారిణిగా అనసూయ!

Thu, Jan 21, 2016
అనసూయ
అనసూయ
త్వరలో అనసూయ ఒక పోలీస్ అధికారిణి పాత్రలో తెరపై కనిపించబోతోంది. సిన్సియర్ పోలీస్ అధికారిణిగా ఆమె ప్రేక్షకులను మెప్పించబోతోంది. తన తాజా చిత్రం 'క్షణం'లో ఆమె ఇలా ఆకట్టుకోబోతోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వాళ్లకి అనసూయ ఎంతగానో దగ్గరైంది. ఆకర్షణీయమైన రూపం .. అలసట లేని ఉత్సాహం ఆమెకి వెండితెరపై అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి.

ఇటీవల 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలో ఆమె పోషించిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆమె మరింత బిజీ అయింది. ఈ నేపథ్యంలో ఆమె 'క్షణం' అనే సినిమాలో పోలీస్ అధికారిణి పాత్రను పోషిస్తోంది. కొంతమంది మహిళా పోలీస్ ఆఫీసర్స్ ను దగ్గర నుంచి పరిశీలించి మరీ, ఆమె ఈ పాత్రకి ఓకే చెప్పిందని ఈ సినిమా టీమ్ అంటోంది. అనసూయ ఎత్తు .. అందుకు తగిన పర్సనాలిటీ కారణంగా పోలీస్ అధికారిణి పాత్రకి సరిగ్గా సరిపోయిందని అంటున్నారు. రవికాంత్ దర్శకత్వంలో పీవీపీ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో, అడవి శేషు .. అదాశర్మ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)