ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరుస సినిమాలతో బిజీగా నిఖిల్

Tue, Jan 19, 2016
నిఖిల్
నిఖిల్
నిఖిల్ వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఈ సినిమాలు మొదలుకానున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా విభిన్నమైన కథలకు సంబంధించినవని ఆయన చెబుతున్నాడు. నిఖిల్ వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ఆ తరువాత వచ్చిన 'శంకరాభరణం' నిరాశపరచడంతో ఆయన డీలా పడ్డాడు. అయితే వెంటనే తేరుకుని తదుపరి సినిమాలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమాను చేయనున్నాడు. ఇక 'కార్తికేయ' సీక్వెల్ కి కూడా ఆయన ఓకే చెప్పాడు. తన క్రేజ్ ను మరింత పెంచిన 'కార్తికేయ'కి సీక్వెల్ గా రానున్న సినిమాపై నిఖిల్ మరిన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇక మరో సినిమాకి కూడా సైన్ చేసినట్టుగా ఆయన చెప్పాడు. ఆ సినిమా వివరాలు తెలియాల్సి వుంది. మరి ఈ మూడు సినిమాలతో ఈ ఏడాది ఆయన చేసే సందడి ఏ స్థాయిలో వుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)