ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుకుమార్ పై దృష్టి పెట్టిన చరణ్

Tue, Jan 19, 2016
చరణ్
చరణ్
దర్శకుడు సుకుమార్ పై చరణ్ దృష్టి పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'నాన్నకు ప్రేమతో' సినిమాకి ఓవర్సీస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అందుకు కారణమని చెబుతున్నారు. మొదటి నుంచి కూడా సుకుమార్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది. ఆయన సినిమాలు చాలా స్టైలీష్ గా వుండటం వలన, కథ కథనాలను ఆసక్తికరంగా నడిపించే తీరు వలన అక్కడ ఆయన సినిమాలకి మంచి ఆదరణ వుంది.

ఇదే విషయాన్ని రీసెంట్ గా రిలీజైన 'నాన్నకు ప్రేమతో' సినిమా కూడా నిరూపించింది. దాంతో ఓవర్సీస్ మార్కెట్ విషయంలో కాస్త వెనుకబడి వున్న చరణ్, అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో సుకుమార్ పై దృష్టి పెట్టాడని అంటున్నారు. సుకుమార్ తో ఒక సినిమా చేయాలనే ఆసక్తితో ఆయన ఉన్నాడని చెబుతున్నారు. ఇక ఆల్రెడీ మహేశ్ బాబు .. అల్లు అర్జున్ .. ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన సుకుమార్, చరణ్ తో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. మరి వీళ్ల కాంబినేషన్ ఎప్పటికి వర్కౌట్ అవుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)