ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలయ్య 100వ సినిమాపై క్లారిటీ వచ్చేసింది!

Mon, Jan 18, 2016
బాలకృష్ణ
బాలకృష్ణ
'ఆదిత్య 369' సీక్వెల్ బాలకృష్ణ 100వ సినిమాగా రానుందనే విషయం తాజాగా ఆయన మాటల వలన స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన బాలకృష్ణ ఆ సందర్భంలో ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ 99వ సినిమాగా చేసిన 'డిక్టేటర్' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన 100వ సినిమాపై అంతా దృష్టిపెట్టారు.

కొన్నిరోజుల క్రితమే 100వ సినిమాను గురించి బాలకృష్ణ దగ్గర ప్రస్తావించినప్పుడు, మార్చిలోగా ఆ సినిమా మొదలవుతుందని చెప్పారు. బోయపాటికి కుదిరితే అతనితో .. లేదంటే మరో దర్శకుడితో తన సినిమా వుంటుందని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు 'ఆదిత్య 369' సీక్వెల్ కి కథ రెడీ చేశారనీ, ఆ విషయంపై తాను సంక్రాంతి తరువాత మాట్లాడతానని చెప్పారు.

ఇక ఈ రోజున ఆయన హైదరాబాదులో కేసీఆర్ ను కలిసిన సందర్భంలో, 100వ సినిమాగా 'ఆదిత్య 369' సీక్వెల్ ఉంటుందని అన్నారు. దాంతో నెల రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)