ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ డేట్!

Mon, Jan 18, 2016
బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందిన 'స్పీడున్నోడు' ఆడియోను ఈ నెల 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పలువురు సినీప్రముఖుల సమక్షంలో ఈ ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - సోనారిక జంటగా భీమనేని శ్రీనివాసరావు 'స్పీడున్నోడు' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 16న చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వలన కుదరక పోవడంతో, ఈ నెల 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

'అల్లుడు శీను'లో బెల్లంకొండ శ్రీనివాస్ తో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందువలన ఈ సినిమాలోనూ వాళ్లిద్దరి మధ్య స్పెషల్ సాంగ్ ను షూట్ చేశారు. గతంలో భీమనేని రీమేక్ చేసిన సినిమాల్లో చాలావరకూ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయాయి. అందువలన 'సుందర పాండ్యన్' అనే తమిళ చిత్రానికి రీమేక్ గా చేసిన ఈ సినిమా కూడా, ప్రేక్షకుల ఆదరణ పొందే అవకాశాలు బాగానే వున్నాయని అనుకుంటున్నారు. వచ్చే నెల 5న ఈ సినిమా విడుదల కానుంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)