ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్యూటీషియన్ గా అంజలి!

Mon, Jan 18, 2016
అంజలి
అంజలి
తాజాగా 'డిక్టేటర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మురిపించిన కథానాయిక అంజలి, తమిళంలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అంగీకరించింది. నూతన దర్శకుడు సర్వేశ్ రూపొందిస్తున్న ఈ చిత్రం కథ మహిళలపై చోటుచేసుకుంటున్న వేధింపులు, హింస చుట్టూ సాగుతుంది. ఇందులో ఆమె బ్యూటీషియన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ, "ఈ కథకు మంచి పెర్ఫార్మేర్ కావాలి. అందుకే అంజలిని అడగడం జరిగింది. ఆమెకు కథ బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే అంగీకరించడమే కాకుండా, ఈ సినిమా షూటింగ్ కోసం ఏభై రోజులు ఎలాట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెస్తుంది" అన్నాడు. ఇందులో ఆమె సరసన అమ్జాత్ హీరోగా నటిస్తున్నాడు. తమిళనాడులోని ఊటీ సమీపంలోని కూనూరులో ఈ చిత్రం షూటింగ్ మొత్తం జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)