ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కంగనా కూడా అదే దారిలో!

Sat, Jan 16, 2016
కంగనా రనౌత్
కంగనా రనౌత్
చిత్రపరిశ్రమకి సంబంధించి కొంతమంది కథానాయకులు .. నాయికల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో వచ్చాయి. మరికొంతమంది ఆత్మకథను రాసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. అలాంటి నాయికల జాబితాలో 'కంగనా రనౌత్' కూడా చేరబోతోంది. ఇటీవల ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఆమె, ఈ విషయాన్ని చెప్పింది.

ఏ రోజుకు ఆ రోజు పోటీ పెరిగిపోయే బాలీవుడ్లో కథానాయికగా నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లోకి కంగనా అడుగుపెట్టింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ .. ఒక్కో మెట్టును అధిరోహిస్తూ తన స్వశక్తితో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ ప్రయాణంలో ఆమెకి ఎన్నో అనుభవాలు .. మరెన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితులను ఆమె ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ స్థానానికి చేరుకుంది. ఆ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ, తాను ఒక పుస్తకాన్ని రాయనున్నట్టు కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)