ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ మూవీకి 3 రోజుల్లో 30 కోట్లు!

Sat, Jan 16, 2016
ఎన్టీఆర్ - రకుల్
ఎన్టీఆర్ - రకుల్
'నాన్నకు ప్రేమతో' సినిమా మూడు రోజుల్లో 30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ సినిమా సాధిస్తోన్న భారీ వసూళ్ల పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ - రకుల్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీస్థాయిలో రిలీజ్ చేశారు.

1700 థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న ఈ సినిమా, మొదటిరోజునే 12 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక మూడు రోజులకు కలుపుకుని 30 కోట్ల వరకూ రాబట్టిందని చెబుతున్నారు. తొలి వారాంతానికి ఈ సినిమా 50 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించడం .. సుకుమార్ టేకింగ్ స్టైల్ .. రకుల్ గ్లామర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఎన్టీఆర్ అద్భుతంగా పండించే యాక్షన్ .. ఎమోషన్ తో ఈ సినిమా రూపొందడం, అలాంటి కథలో ఆయన సరికొత్త స్టైల్ తో కనిపించడం ఈ స్థాయి వసూళ్లకు కారణమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)