ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్యతో పవన్ మరో సినిమా

Fri, Jan 15, 2016
పవన్
పవన్
పవన్ కల్యాణ్ కెరీర్లో 'ఖుషి' సినిమాకున్న ప్రత్యేకతే వేరు. బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం పవన్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకుపోయింది. తమిళ దర్శకుడు యస్.జె.సూర్య రూపొందించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి దర్శకుడు సూర్య ఇటీవల పవన్ ను చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన చెప్పిన కథ కూడా పవన్ ని బాగా ఆకట్టుకుందట. దాంతో ఆయన స్క్రిప్టు పరంగా కొన్ని సూచనలు కూడా చేశారని సమాచారం.
కొన్నాళ్ల క్రితం సూర్యాతో తాను చేసిన 'పులి' సినిమా అపజయం పాలైనప్పటికీ, ఆయన టాలెంట్ పై పవన్ కి నమ్మకం ఏమాత్రం సడలకపోవడం విశేషం. కాగా, ఈ చిత్రానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను చేస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' పూర్తయిన తర్వాత పవన్ దీనిపై దృష్టి పెట్టనున్నట్టు చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)