ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ లోను 'కత్తి' రీమేక్!

Thu, Jan 14, 2016
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్
ఒకవైపున తెలుగులో చిరంజీవి 'కత్తి' రీమేక్ కి సిద్ధం చేస్తూ వుంటే, మరో వైపున అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ్లో విజయ్ కథానాయకుడిగా 'కత్తి' చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించాడు. 2014లో వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. విజయ్ కెరియర్లోనే సంచలనాన్ని నమోదు చేసిన చిత్రంగా నిలిచింది.

ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో, తన 150వ సినిమాగా చిరంజీవి దీనినే ఎంపిక చేసుకున్నారు. చిరంజీవి కొత్త కథలు చాలా విన్నా, ఆయన 'కత్తి' రీమేక్ లో చేయడానికే నిర్ణయించుకున్నారు. అంతగా ఆయనని ఈ కథ ప్రభావితం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందీలో ఈ సినిమా రీమేక్ చేయడానికి అక్షయ్ కుమార్ అంగీకరించాడట. ప్రస్తుతం 'రోబో 2.0' సినిమాలో నటిస్తోన్న ఆయన, ఆ తరువాత ఈ సినిమాతో సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)