ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కత్రినాకి కానుకనిచ్చిన హీరో!

Wed, Jan 13, 2016
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్
కత్రినాయే వెండితెరకి లభించిన ఖరీదైన కానుక అని, ఆమె అభిమానులు చెబుతుంటారు. అలాంటి కత్రినాకి గతంలో కొంతమంది హీరోలు కానుకలు ఇచ్చి ఆమె పట్ల తమకి గల అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఆదిత్యరాయ్ కపూర్ కూడా చేరిపోయాడని అంటున్నారు.

అభిషేక్ కపూర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ .. ఆదిత్యరాయ్ కపూర్ జంటగా 'ఫితూర్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్రినాకి కాశ్మీర్ కి చెందిన 'పష్మీనా' శాలువను ఆదిత్యరాయ్ కపూర్ కానుకగా ఇచ్చాడట. చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ తో మనసును దోచేయడం ఈ శాలువ ప్రత్యేకత. అలాంటి శాలువను స్వయంగా ఎంపిక చేసి మరీ దానిని కత్రినాకి కానుకగా ఇచ్చాడని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయిందట.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)