ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మళ్లీ ఛాన్స్ ఇస్తాడా?

Wed, Jan 13, 2016
సుకుమార్
సుకుమార్
మహేశ్ బాబు తనకి మళ్లీ ఛాన్స్ ఇస్తే చాలనీ .. ఆయనకి హిట్ ఇస్తానని దర్శకుడు సుకుమార్ అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించాడు. గతంలో సుకుమార్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ' 1 నేనొక్కడినే' సినిమా వచ్చింది. ఈ సినిమా మహేశ్ తో పాటు ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరిచింది.

ఈ సినిమాను గురించి సుకుమార్ ప్రస్తావించాడు. '1 నేనొక్కడినే' సినిమా విషయంలో మహేశ్ బాబు - నిర్మాతలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారనీ, అలాంటిది ఆ సినిమా పరాజయం పాలవడం తనకి ఎంతో బాధ కలిగించిందని సుకుమార్ చెప్పాడు. టెక్నికల్ గా ఈ సినిమా ఒక వర్గం వారిని ఆకట్టుకున్నా, సాధారణ ప్రేక్షకులను చేరుకోలేకపోయిందని అన్నాడు. అందువలన మహేశ్ బాబు తనకి మరో అవకాశం ఇస్తే, తప్పకుండా హిట్ ఇస్తాననే నమ్మకంతో వున్నానని సుకుమార్ చెప్పాడు. మరి ఆయనకి మహేశ్ మళ్లీ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)