ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్త పాత్రల పట్ల జగపతి ఆసక్తి!

Wed, Jan 13, 2016
జగపతిబాబు
జగపతిబాబు
ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలు తనని రిచ్ ఫాదర్ గా చూపించడానికే ఇష్టపడుతున్నారనీ, అందువలన అంతా తనని రిచ్ ఫాదర్ అని పిలుస్తున్నారని జగపతిబాబు అన్నారు. కథానాయకుడి నుంచి విలన్ పాత్రల వైపుకి టర్న్ తీసుకున్న జగపతిబాబు, ఆ తరువాత తండ్రి పాత్రల్లోను శభాష్ అనిపించుకున్నారు.

'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్ బాబుకి తండ్రిగా ఆయన నటించారు. ఈ సినిమాలో ఒక రిచ్ ఫాదర్ గా ఆయన చూపిన నటన ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత ఆయన 'నాన్నకు ప్రేమతో' సినిమాలోను రిచ్ ఫాదర్ గా నటించారు. ఈ పాత్ర కూడా తనకి సంతృప్తిని ఇచ్చిందని ఆయనే చెప్పారు. అయితే వరుసగా ఈ తరహా పాత్రలు కాకుండా, కొత్తగా అనిపించే పాత్రలు చేయాలని వుందనే ఆసక్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన కోసం రచయితలు .. దర్శకులు కొత్తగా ఎలాంటి పాత్రలను క్రియేట్ చేస్తారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)