ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సురభి కొత్తగా కనిపిస్తుందట!

Wed, Jan 13, 2016
సురభి
సురభి
తెలుగు తెరకి కొత్తగా పరిచయమైన కథానాయికలలో 'సురభి' పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిన్న సినిమాల్లో అవకాశాలను సంపాదించుకోవడంలో ఈ అమ్మాయి మరింత ముందుంది. అలాంటి సురభి .. 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా కోసం ఫైట్లు నేర్చుకుందట. 'బీరువా' సినిమా ద్వారా తెలుగు తెరకి సురభి పరిచయమైంది. గ్లామర్ పరంగా మంచి మార్కులే దక్కినా, ఆశించిన స్థాయిలో ఆమెని వెతుక్కుంటూ అవకాశాలు రాలేదు.

కాస్త గ్యాప్ వచ్చినా ' ఎక్స్ ప్రెస్ రాజా' వంటి మంచి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో తనపై యాక్షన్ సీన్స్ వున్నాయని చెప్పడంతో, ఫైట్స్ చేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పింది. అలాగే ఇంతవరకూ తాను చేయని కామెడీని కూడా ఈ సినిమాలో చేశానని అంది. రేపు విడుదల కానున్న ఈ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. గ్లామర్ పరంగాను .. యాక్షన్ .. కామెడీ పరంగాను తనని కొత్తగా చూపించిన ఈ సినిమా, తన కెరియర్ కి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)