ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హాలీవుడ్ దిశగా వర్మ 'వీరప్పన్'

Tue, Jan 12, 2016
రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ
హాలీవుడ్ తెరపై 'వీరప్పన్' ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ సినిమాకి కూడా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. వర్మ ఇటీవల 'కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన టేకింగ్ సత్తాను వర్మ మరోమారు చూపించాడు. దాంతో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దుబాయ్ కి చెందిన ఒక బిజినెస్ మేన్ ఈ సినిమాను చూసి వర్మను ప్రశంసించాడట.

అంతే కాకుండా ఇంటర్నేషనల్ వెర్షన్ ని కూడా తెరకెక్కిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఆ వెర్షన్ కి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని మాట ఇచ్చాడట. దాంతో వర్మ రంగంలోకి దిగాడని అంటున్నారు. 'కిల్లింగ్ వీరప్పన్' లో వీరప్పన్ కోసం అన్వేషించడం .. అతణ్ణి అంతం చేయడం మాత్రమే వర్మ చూపించాడు. ఇక ఇంటర్నేషనల్ వెర్షన్ కోసం ఆయన ఈ కథను మరింత విస్తరించి .. వీరప్పన్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే నటీనటులు .. హాలీవుడ్ టెక్నీషియన్ల ఎంపిక మొదవుతుందని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)