ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'డిక్టేటర్' బెనిఫిట్ షో సందడి!

Tue, Jan 12, 2016
'డిక్టేటర్' లో ఓ దృశ్యం
'డిక్టేటర్' లో ఓ దృశ్యం
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న 'డిక్టేటర్' సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బెనిఫిట్ షో పట్ల అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. దాంతో హైదరాబాద్ - కుకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్లో, 14 ఉదయం 5 గంటలకు ఈ సినిమా బెనిఫిట్ షో ను ప్లాన్ చేశారు. బాలయ్య యువసేన ఆధ్వర్యంలో ఈ బెనిఫిట్ షో ను వేస్తున్నారు.

బాలకృష్ణ సినిమాలు భారీతనానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటాయి. బాలకృష్ణ యాక్షన్ .. ఎమోషన్ .. ఆయన చెప్పే డైలాగ్స్ కోసం మాస్ ఆడియన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తుంటారు. మామూలు రోజుల్లోనే ఆయన సినిమాలకి బెనిఫిట్ షోల సందడి ఎక్కువగా వుంటుంది. ఇక సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమా బెనిఫిట్ షో కి సహజంగానే ఒక రేంజ్ లో డిమాండ్ వుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా కోసమే ఆయన అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)