ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాల శివ రెడీ అవుతున్నాడు

Tue, Jan 12, 2016
కొరటాల శివ
కొరటాల శివ
కొరటాల శివ రెడీ అవుతున్నాడు .. తన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 'మిర్చి'తో ప్రభాస్ కి హిట్ ఇచ్చిన శివ, 'శ్రీమంతుడు'తో మహేశ్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా ఒక్కసారిగా ఆయనని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది.

ఈ నేపథ్యంలో అగ్రకథానాయకులు శివతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ అవకాశం ఎన్టీఆర్ కి ముందుగా దక్కింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' రూపొందనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో మెకానిక్ గా కనిపిస్తాడు. అందుకే ఈ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో మోహన్ లాల్ .. నిత్యామీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా, ఫిబ్రవరి 10 నుంచి సెట్స్ పైకి వెళుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)