ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Jan 10, 2016
అనసూయ
అనసూయ
* 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రంతో నటిగా కూడా మారిన టీవీ హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు ఎక్కువగా సినిమాలపైనే దృష్టి పెడుతోంది. 'సోగ్గాడే...'లో తాను చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ, తనకు మంచి పేరు వస్తుందని అంటోంది. ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లు వున్నాయని, వీటిలో కొన్నిటికి త్వరలో సంతకం చేయనున్నానని చెప్పింది.
* ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ రూపొందించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం సెన్సార్ కార్యక్రమం రేపు (సోమవారం) జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
* సుధీర్ బాబు, నందిత జంటగా ఇటీవల వచ్చిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ రొమాంటిక్ సినిమాగా పురస్కారం అందుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న హైదరాబాదులో యూనిట్ కు సత్కారం జరిగింది. దీనికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై నటీనటులను, సాంకేతిక నిపుణులను అభినందించారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)