ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేథరిన్ కి మాతృభాష రాలేదట!

Sat, Jan 09, 2016
కేథరిన్
కేథరిన్
తెలుగు .. తమిళ భాషల్లో మలయాళ భామల హవా చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. అందంలోను .. అభినయంలోను అత్యధిక మార్కులు వారివే. ఇతర భాషల్లో ప్రావీణ్యం సంగతి అటుంచితే, మాతృభాషలో వాళ్లు అనర్గళంగా మాట్లాడేస్తూ వుంటారు. కానీ తనకి మాత్రం మాతృభాష రాలేదని కేథరిన్ వాపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమేనని అంటోంది.

కేథరిన్ పేరు వినగానే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో గ్లామర్ పరంగా ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం 'సరైనోడు' సినిమాలో నటిస్తోంది. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లోను వరుస సినిమాలు చేస్తోంది. తనకి కన్నడ .. హిందీ .. ఇంగ్లిష్ భాషలు బాగా తెలుసును గానీ, మాతృభాష మలయాళమే తెలియదని అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తాను మలయాళీ కుటుంబానికి చెందినదాననే అయినా, దుబాయ్ లో పుట్టి పెరగడం వలన మలయాళం నేర్చుకోలేకపోయానని అంటోంది. ఇక ఇప్పుడు నేర్చుకోవడం మొదలుపెడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)