ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రైలు ప్రయాణంలో ప్రేమకథ!

Sat, Jan 09, 2016
కీర్తి సురేష్
కీర్తి సురేష్
ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్య పుట్టుకొస్తుందో ఎవరికీ తెలియదు. ప్రభుసాల్మాన్ దర్శకత్వం వహించిన ఒక సినిమాలో, ఒక అబ్బాయికి .. అమ్మాయికి మధ్య రైలు ప్రయాణంలో ప్రేమ మొదలవుతుంది. అందుకనే ఈ సినిమా తమిళ్లో 'రయిల్' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ధనుష్ రైల్వే పాంట్రీ గా .. ఆయనని ప్రేమించే కథానాయికగా కీర్తి సురేష్ నటించారు.

కథాపరంగా న్యూఢిల్లీ - చెన్నయ్ మధ్య రైలు ప్రయాణంలో ఈ సినిమా నాయకా నాయికలు కలుసుకుంటారు. ఈ ప్రయాణంలో ఏర్పడిన పరిచయం, వాళ్లు గమ్యస్థానానికి చేరుకునేలోగా ప్రేమగా మారుతుంది. ఆ తరువాత ఆ జంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే కథాంశంతో ఈ సినిమా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఈ సినిమా పలకరించనుంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)