ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ దారిలోనే ప్రియమణి!

Sat, Jan 09, 2016
ప్రియమణి
ప్రియమణి
తెలుగు తెరపై నాయకా నాయికలుగా క్రేజ్ ను సొంతం చేసుకున్నవాళ్లు, అప్పుడప్పుడు తమ పాటలను తామే పాడుకుంటూ అభిమానుల ముచ్చట తీరుస్తూ వుంటారు. ఇక ఇతర భాషల్లోని నాయకా నాయికల కోసం కూడా గొంతు సవరించుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. అలా పాటందుకున్న కథానాయికల జాబితాలో కాజల్ తరువాత ప్రియమణి కూడా చేరిపోయింది.

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా ప్రియమణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో 'దేవరన్వే బుడుగురు' అనే కన్నడ సినిమా దర్శక నిర్మాతలు స్నేహపూర్వకంగా కోరడంతో, పాట పాడటానికి ప్రియమణి అంగీకరించిందట. శ్వేతాబసు ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా కోసం ప్రియమణి పాట పాడింది. ఇటీవల ఎన్టీఆర్ .. కాజల్ ఒక కన్నడ సినిమాలో చెరో పాట పాడిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రియమణి కూడా ఒక పాట పాడేసి తనలోను మంచి గాయని వుందని నిరూపించుకుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)