ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా సాంగ్ హైలైట్ అవుతుందట!

Sat, Jan 09, 2016
తమన్నా
తమన్నా
'స్పీడున్నోడు' సినిమాలో తమన్నా - బెల్లంకొండ శ్రీనివాస్ పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్, ఈ సినిమాకి హైలైట్ అవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ - సోనారిక జంటగా నటించిన ఈ సినిమాలో, తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. బ్యాచులర్స్ పార్టీ సందర్భంలో ఈ సాంగ్ వస్తుందని అంటున్నారు.

పెళ్లి తరువాత భార్యను ఎలా చూసుకోవాలో హీరోకి చెబుతూ సాగే ఈ సాంగ్ ను, చాలా రొమాంటిక్ గా చిత్రీకరించారని అంటున్నారు. శ్రీవసంత్ బాణీ కట్టిన ఈ పాటకి తమన్నా - బెల్లంకొండ శ్రీనివాస్ వేసిన డాన్స్ ఒక రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ అనిపించుకుంటుందనీ, యూత్ ను ఉత్సాహంతో ఊపేస్తుందని అంటున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)