ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తొలి హీరోతో సమంతా మళ్లీ చేస్తుందా?

Sat, Jan 09, 2016
సమంతా
సమంతా
తెలుగు .. తమిళ భాషల్లో సమంతా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. కొత్త కథానాయికలు ఎక్కువమందే వస్తున్నా, ఆమెకి వరుసగా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె హీరో అధర్వతో జోడీ కట్టడానికి ఓకే చెబుతుందో లేదోననే ఆసక్తితో కోలీవుడ్ సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే, తమిళ్లో సమంతా మొదటి సినిమాకి అధర్వ కథానాయకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించింది.

ఆ తరువాత తమిళ .. తెలుగు భాషల్లో సమంతా వరుస విజయాలను అందుకుంటూ అగ్రస్థానానికి చేరుకుంది. అధర్వ కెరియర్ ఆ స్థాయిలో స్పీడ్ అందుకోలేదు. ఇప్పుడు ఆయన తనే హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సమంతానే తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలుపెట్టాడట. మరి వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ వస్తోన్న సమంతా, తన మొదటి హీరో సినిమాకి ఓకే చెబుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)