ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రూటు మార్చిన ముద్దుగుమ్మ

Sat, Jan 09, 2016
అమలాపాల్
అమలాపాల్
గతంలో ప్రేక్షకులను గ్లామర్ పాత్రలతో మురిపించిన అమలాపాల్ ఇప్పుడు రూటు మార్చేసింది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మడి పాత్రల ఎంపికలో పెద్ద మార్పు కనిపిస్తోంది. హుందాగా వుండే పాత్రలు పోషించడానికి ఆమె మొగ్గుచూపుతోంది. ఆ క్రమంలో సూర్య కథానాయకుడుగా రూపొందిన 'పసంగా 2' సినిమాలో పిల్లల తల్లిగా, గృహిణి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు మరోసారి అమ్మగా నటించడానికి ఈ చిన్నది ఓకే చెప్పింది. అశ్వనీ అయ్యర్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మిస్తున్న 'అమ్మ కణక్కు' (అమ్మ లెక్క) అనే ఈ చిత్రంలో అమలా పాల్ తల్లిగా ఓ నిండైన పాత్రను పోషిస్తోంది. మొత్తానికి, పెళ్లి తర్వాత ఎలాంటి పాత్రలు పోషిస్తే, సినిమాలలో కంటిన్యూ కావచ్చో అమ్మడికి బాగా తెలిసిపోయింది!
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)